చెందిన సంఘటన మాక్లూర్ మండలంలోనీ బోర్గం చెరువులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం నిజమాబాద్ నగరంలోని నందేవాడలో గల సంజీవయ్య కాలోనికి చెందిన హానుమంతే విశాల్ బాబూ (24) . బంటు శక్తి,ఆర్మూర్ నరేష్ లు ముగ్గురు కలసి బొర్గం దగ్గర ఉన్న చెరువు దగ్గర మద్యం సేవించారు. అనంతరం చెరువులో కాళ్లు, చేతులు కడుకునే క్రమంలో విశాల్ బాబు ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడిపోయాడు.
అతడిని కపాడ డానికి బంటు శక్తి, ఆర్మూర్ నరేష్ లు చెరువులొకి దిగారు.వాళ్ళు కూడా మునిగిపోయే క్రమంలో బంటు శక్తి ఆర్మూర్ నరేష్ లను స్తానికులు చూసి ఇద్దరినీ బయటకి తీశారు.విశాల్ బాబు అప్పటికే నీటిలో మునిగి ఆచూకీ లభ్యం కాలేదు.
సోమవారం ఉదయం పోలీస్లు సమాచారం మేరకు గజ ఈతగాల్లను దించి గాలించగా మృతదేహం లభ్యం కావటంతో విశాల్ బాబు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.





