అయిదు నెలలో రాష్త్రంను ఆగంపట్టించారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని తాన రథం కదిలింది కాబట్టే సర్కార్ దయ్యం వదిలింది ఆగిపోయిన రైతు మళ్ళీ మొదలయ్యిందని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు .
ముఖ్యమంత్రి కి వణుకు పుట్టిందన్నారు సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలో నెహ్రూ పార్కులో జరిగిన రోడ్ షోలో కెసిఆర్ మాట్లాడారు. కాలు విరిగి కుంటి ఉన్న తాను పిడికిలి బిగించి రోడ్డెక్కనన్నారు కాబట్టే ప్రభుత్వం కదిలిందని.
ఆరు గ్యారెంటీలో ఏ గ్యారెంటీ పూర్తి కాలేదని మహిళలకు 2000 ఇచ్చారా అని ప్రశ్నించారు. నేను పిడికిలి బిగించి రోడ్డు ఎక్కను కాబట్టి రైతుబంధు ఈ రోజు నుంచి వేస్తానన్నారని ఆయన చెప్పారు. అందుకే ఆగిన పతకాలు మళ్ళీ రావాలంటే అందరు కదిలాలన్నారు.ఐదు నెలలకే తెలంగాణను ఆగం చేశారన్నారు.
అనేక సంక్షేమ పథకాలు నిలిపివేస్తారన్నారు కరెంటు కోతలు పెడుతున్నారని మిషన్ భగీరథ అనిల్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు ఆగిన పథకాలు మళ్ళీ రావాలంటే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదని 400 సీట్లు అన్ని గప్పాలు కొడుతున్నారని కానీ 200 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదని సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తమకు 14 సీట్లు తమకు గెలిపిస్తే ఆగిపోయిన పథకాలు అన్నిటిని మొదలుపెట్టి ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
పదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ సబ్కా వికాస్ అన్నారని కానీ దేశం సచ్చెన సైందని దుయ్యబట్టారు. ఇంటింటికి 15 లక్షలు ఇస్తాననీ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ వరప్రదాయిని గోదావరిని తరలించడానికి కుట్రలు చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు మన గోదావరి మనకే ఉండాలంటే లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలవాలన్నారు లేకపోతే ఉన్న గోదావరి వట్టిపోతదన్నారు జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇస్తామని గాలికి వదిలేశారు 10 ఏళ్లలో జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని కళ్యాణ లక్ష్మి స్కీములో తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా? మహిళలకు 2000 పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా? రైతులకు 500 బోనాస్ ఇస్తానన్నారు బోనస్ ,బోగస్ అయిందని కనీసం వడ్లకొనే దిక్కు లేదన్నారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల స్కాలర్షిప్లు ఆపివేస్తారని ఆయన అన్నారు తెలంగాణలో చేనేత రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని ఐదో నెలలకే ఆగం పట్టిస్తున్నారని ఆయన అన్నారు.
ఐదు నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందన్నారు. ఈ సభలో లోక్సభ ఎంపీ అభ్యర్థి బాగిరెడ్డి గోవర్ధన్ ,మాజీ మంత్రి వేముల ప్రశాంత్, రెడ్డి బీగాల గణేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.














