ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి జిల్లాకు వచ్చిన బిఆర్ యస్ అధినేత కెసిఆర్ మంగళవారం జిల్లా కేంద్రంలో నే ఉన్నారు. మధ్యాహ్నం తరవాతే ఆయన కామారెడ్డి కి వెళ్లనున్నారు.
నెహ్రు పార్క్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత నేరుగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంటికి వెళ్లిన కెసిఆర్ గంట పాటు పార్టీ కి చెందిన ముఖ్యనాయకులను కలిశారు.
రాత్రి అక్కడే బస చేసారు. కానీ మంగళవారం ఆయన ఎవరిని కలవడానికి ఆసక్తి చూపలేదు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు కెసిఆర్ ను కలవడానికి బిగాల ఇంటికి వచ్చి కెసిఆర్ అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ముందు జాగ్రత వారు వేచి ఉండడానికి మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు టెంట్ లుకూడా వేసి పెట్టారు.
కానీ సార్ మధ్యాహ్నం వరకు బయటికి రారు అంటూ కెసిఆర్ వ్యక్తిగత సిబ్బంది స్పష్టంగా చెప్తున్నారు. ఉదయం అల్పహారం కన్న ముందునుంచే ఎన్నికల వ్యుహరచనలో ఉన్నారని సమాచారం.
కొంత మంది నాయకులతో అయన ఫోన్ లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను వాకబు చేసారు.
ఆతర్వాత మాజీ ఎమ్మెల్యే లను సంప్రదించారు. పోలింగ్ ఇంకా అయిదు రోజుల గడువే ఉండడంతో అనుసరించాల్సిన వ్యూహం ఫై దిశా నిర్దేశం చేసారు.
బాజిరెడ్డి గోవర్ధన్ కు సానుకూల వాతావరణం వుందని తన సర్వేల్లో తేలిందని సమిష్టగా పనిచేసే ఫలితం అనుకూలంగా వుంటుందని కెసిఆర్ చెప్తున్నారట