బిఆర్ యస్ అధినేత మాజీ సీఎం కెసిఆర్ కాసేపట్లో జిల్లాలో కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. లోకసభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పక్షాన జిల్లాలో విసృతంగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం చేసి అక్కడే నిద్రపోయిన అయన సోమవారం మధ్యాహ్నం జగిత్యాల్ నుంచి బస్సు లో బయలు దేరారు.మెట్ పల్లి కమ్మర్ పల్లి మోర్తాడ్ ఆర్మూర్ ల మీదుగా నిజామాబాద్ నగరానికి సాయంత్రం 5:00 గంటలకు చేసుకొని రాత్రి 9:30 దాక రోడ్ షో సభల్లో పాల్గొనబోతున్నారు 5:35 నిమిషాలకు, ఎన్టీఆర్ చౌరస్తా నుండి మొదలై కలెక్టరేట్ గ్రౌండ్,తిలక్ గార్డెన్ చౌరస్తా, RTC బస్టాండ్, మీదుగా 6 గంటల 30 నిమిషాలకు గాంధీ చౌక్, చేరుకుంటుంది, … గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ మధ్య కార్నర్ మీటింగ్ లో కెసిఆర్ ప్రసం5గిస్తారు,
ఈ సభ కోసం నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్ ల నుంచి భారీఎత్తున ప్రజలను తరలించే ఏర్పాట్లు బిఆర్ ఎస్ నేతలు చేస్తున్నారు .సోమవారం రాత్రి ప్రచార సభ తర్వాత నేరుగా మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా గారి నివాసంకు చేరుకొని భోజనం తర్వాత అక్కడే బస చేస్తారు, మంగళవారం ఉదయం పార్టీ నేతలతో సమావేశం అయి దిశానిర్దేశం చేస్తారు అలాగే కుల సంఘాలు ప్రజాసంఘాల నేతలతో కలుస్తారు .
పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు @@@@ ‘కెసిఆర్ సభ కోసం జిల్లా నలుమూలల నుంచే వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఈ మూడు నియోజకవర్గాల నుండి వచ్చే కార్యకర్తలు ప్రజలకు ముఖ్య విషయం:
పార్కింగ్ స్థలాలు :
పురాతన కలెక్టరేట్ గ్రౌండ్, ఇరిగేషన్ వాటర్స్, ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్,ఆర్టీసీ ఎల్లమ్మ గుట్ట కామన్, స్థలాల్లో వాహనాలు నిలుచుకోవచ్చు.
2) బోధన్ నిజామాబాద్ అర్బన్ ఈ 2 నియోజకవర్గాల నుండి వచ్చే కార్యకర్తలు ప్రజలకు ముఖ్య విషయం: పార్కింగ్ స్థలాలు :*
ఐటిఐ గ్రౌండ్ శైలజ గ్రౌండ్ లో వాహనాలు నిలుపు కునేలా ఏర్పాట్లు చేసారు .కెసిఆర్ రోడ్ షో జరిగే ప్రాంతాల్లో గులాబీ జెండాలు కట్టారు.