ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, టెక్స్ట్ బుక్స్ మరియు బ్యాగులు, నోట్ బుక్స్ ,వర్క్ బుక్స్ తదితర విద్యా సామాగ్రిని ఉచితంగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది,
కావున అన్ని ప్రభుత్వ పాఠశాలలో అందే విధంగా చూడాలని ఆయన ఎంఈఓ గారికి కోరారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్ , మరియు బోధన్ పట్టణ కార్యదర్శి వీరేశ్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
