గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ, తాజాగా ‘ఇగ్నైట్’ పేరుతో కొత్త అవతారం ఎత్తి సామాన్యులను నిలువునా దోచుకునేందుకు సిద్ధమైందని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ సంస్థ తలపెట్టిన సుమారు రూ.5 వేల కోట్ల భారీ మోసపూరిత కుట్రను పోలీసులు సమయస్ఫూర్తితో భగ్నం చేశారు. గురువారం నాడు జరిగిన మీడియా సమావేశంలో సీపీ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ గత 25 ఏళ్లుగా వివిధ పేర్లతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని దండుకుంటోందని సీపీ వివరించారు.ఈ తరహా మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట సాగే మోసపూరిత సంస్థల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
