HomeTelanganaNizamabad45వ డివిజన్ లో 2036 ఓట్లతో ఘన విజయం..

45వ డివిజన్ లో 2036 ఓట్లతో ఘన విజయం..

ఉత్కంఠ భరితంగా సాగిన 45వ డివిజన్ మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ ఘన విజయం సాధించారు.

కౌంటింగ్ కేంద్రం నుంచి వెలువడిన తుది ఫలితాల ప్రకారం, ఆమె తన సమీప ప్రత్యర్థిపై 2036 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు.పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్లను పరిశీలిస్తే, మొదటి రౌండ్ నుంచే సువర్ణ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.

ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం ఆమె విజయానికి బాటలు వేసింది. ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, డివిజన్ అభివృద్ధిపై సువర్ణ ఇచ్చిన హామీలు, పార్టీ శ్రేణుల సమన్వయం ఆమెను విజయతీరాలకు చేర్చాయి.విజయం ఖరారు కావడంతో డివిజన్ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments