Sunday, April 26, 2026
HomePOLITICAL NEWSUncategorizedబోధన్ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం బయట లాటి చార్జ్ ..సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో లాఠీ...

బోధన్ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం బయట లాటి చార్జ్ ..సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో లాఠీ జూలిపించిన పోలీసులు..

కౌంటింగ్ కేంద్రం బయట గుమ్ముగూడిన యువకులపై లాఠీచార్జ్ మన తెలంగాణ బోధన్ బోధన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం బయట శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో లాటి ఛార్జ్ నిర్వహించారు కౌంటింగ్ కేంద్రాన్ని విజయ మేరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయగా ఫలితాలు వెలువడే సమయానికి కౌంటింగ్ కేంద్రం బయట పెద్ద ఎత్తున యువకులు, గుమ్మిగూడారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కౌంటింగ్ కేంద్రం బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ యువకులు వినకపోవడంతో అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లాఠీలకు పని చెప్పారు ఆయనే స్వయంగా అక్కడ ఉండి పోలీస్ సిబ్బందితో లాఠీ చార్జ్ చేయించి యువకులను చెదరగొట్టించారు పోలీసులు ఒక్కసారిగా లాఠీలకు పని చెప్పడంతో గుమ్మిగూడిన యువకులు చెల్లాచెదరువయ్యారు పోలీసులు వెంటపడి మరి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు కౌంటింగ్ కేంద్రం బయట యువకులను చదరగొట్టడంతో ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది పోలీసు ఆంక్షలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని సిపి హెచ్చరికలు జారీ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!