HomeCRIMEపట్టపగలే శంభుని గుడి లో చోరీ

పట్టపగలే శంభుని గుడి లో చోరీ

నిజామాబాద్ నగరంలోని శంభుని గుడిలో పట్టపగలే చోరీ జరిగింది ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని విలువైన వెండిసామగ్రిని ఎత్తుకెళ్లారు .

బుధవారం మధ్యాహ్నం సమయంలో ఓ దుండగుడు శంభుని గుడి గోడ దూకి లోనికి వచ్చాడుఅనంతరం అక్కడ ఉన్న వెండి హారతి పల్లాలు, శత గోపురం, ఇత్తడి పూజ సామాగ్రి, పంచలోహ హారతి పళ్లెం, రాగి ప్లేట్లు దోచుకుని పరారయ్యాడు. సాయంత్రం సమయంలో పూజారి వచ్చి ఆలయం ప్రధాన గేటు తెరిచి లోనికి వెళ్లగా అక్కడ ఉన్న పూజ సామగ్రి కనిపించలేదు.

చోరీ విషయమై సంబంధిత రెండోటౌన్‌ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో ఎస్సై ముజాహిద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఆలయ పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుడు ఆలయం గోడ దూకి లోపటికి వెళ్లి చోరీ చేసిన అనంతరం తిరిగి వెళ్లే దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.

సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగిలించిన ఆలయ పూజ సామాగ్రిని కొనుగోలు చేసిన వ్యాపారి ఆచూకీ తెలుసుకున్నారు.. ఈ చోరీ ఘటనపై ఆలయ పూజారి రాజ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కేసు నమోదు చేశారు.

సీసీ కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా ఆలయంలో చోరీకి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments