రైల్వే కొలువుల పేరుతో వసూళ్లకు పాల్పడిన ముఠా డొంక కదులుతుంది. ఫిర్యాదులు వేలువెతుతున్నాయి. ఈ ముఠా బారిన పడినవాళ్ళు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.
నిజామాబాద్ లోని మూడు ఠాణాల్లో ఆరు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. వివిధ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలికిన సదరు ముఠా, ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
నకిలీ నియామక పత్రాలు సృష్టించి బాధితులను నమ్మించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసు రంగంలోకి దిగి ఈ ముఠాకు చెందిన ఓ వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
మరికొందరు బాధితులు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ స్కామ్ విలువ భారీగా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
