శనివారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో సివిల్, ఆర్మ్ డ్ రిజర్వ్, మొత్తం 344 మంది కానిస్టేబుళ్లుకు పోస్టింగ్ లు ఇస్తూ ఇన్చార్జి సీపీ సింధు శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.సివిల్ విభాగంలో 218 మంది కానిస్టేబుళ్లలో 150 మంది పురుష కానిస్టేబుల్లు, 68 మంది మహిళలు చేరారు.
అలాగే ఏ ఆర్ విభాగంలో మొత్తం 126 మందికి పురుషులు 87మంది,మహిళలు 39 మంది చేరారు.దీనితో జిల్లా పోలీస్ శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత కొంత వరకు తీరనుంది. కానిస్టేబుల్ పోస్టుల కేటాయింపుతో ఆయా పోలీస్టే స్టేషన్లలో ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి.
2022 లో రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుళ్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ప్రిలిమరీ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫిజికల్ టెస్ట్లు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి 2023ఏప్రిల్ 30న కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష నిర్వహించగా అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటించారు.
సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణను 2024 ఫ్రిబవరి20న ప్రారంభించారు.నవంబర్ 21న శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు పోలీస్ అవుట్ పాసింగ్(పీవోపీ) చేపట్టారు. దీంతో జిల్లాకు కొత్త పోలీస్ కానిస్టేబుళ్లు విధుల్లోకి చేరబోతున్నారు.
ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) కోటేశ్వర రావు మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది శిక్షణ కాలంలో నేర్చుకున్న నూతన పద్ధతులను మీ సర్వీసు మొత్తం పనికి వస్తాయని, ప్రతీ ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని, ప్రతీ ఒక్కరు తమ పై అధికారి సూచనలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏ విషయం అయినను తమ పై అధికారికి తెలియజేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎ.ఆర్ ఎ.సి.పి నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్, శ్రీనివాస్, తిరుపతి, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
