ప్రేమించిన యువతి పెళ్ళి కి నిరాకరించడంతో మనస్థాపానికి చెంది యువకుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ నగరంలోని అరుంధతి నగర్ లో చోటు చేసుకుంది.
3వ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి నగరంలోని అరుంధతి నగర్ కి చెందిన ప్రమోద్ కుమార్ (24) పెయింటర్ గా పని చేస్తున్నాడు. అయితే సదరు యువకుడు గత కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
అమ్మాయి పెళ్ళి కి నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్ లు తెలిపారు.అనంతరం సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతుని తల్లి రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.