దమ్ము ట్రాక్టర్ చక్రాల కింద పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన గురువారం నవిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.
మండలంలోని మహంతంకు చెందిన సాయి కుమార్(24). గ్రామంలో గల ఓ వ్యక్తి పొలంలో ట్రాక్టర్ దమ్ము చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతడు ట్రాక్టర్ చక్రాల కింద పడి మృతి చెందినట్లు వెల్లడించారు.
అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన వెళ్లి ట్రాక్టర్ ను పికి లేపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.
