ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.గురువారం నిజాంబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో గల ఎమ్మెస్సార్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి తారా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఇటీవల అరోమా రెస్టారెంట్ లో దాడులు నిర్వహించి నిలవ ఉంచిన, కాలం చెల్లిన ఆహారాన్ని సీజ్ చేశారు. ఈ ఘటన మరువక ముందే, విశ్వాస నీయ సమాచారం మేరకు బోర్గం ప్రాంతంలో గల MSR బార్ లో తనిఖీలు నిర్వహించారు.
ఈ బార్ లో కాలం చెల్లిన ఫుడ్ కలర్, శాస్, టెస్టింగ్ సాల్ట్ ను సీజ్ చేశారు. కుళ్లిన నిల్వ ఉంచిన ముట్టన్ కీమా, చికెన్ ను స్వాధీన కాల్చేసుకున్నారు. ఈ శాంపిల్స్ ను కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారిలు హోటల్ యజమానులకు హెచ్చరించారు.