రోడ్డు ప్రమాదంలో ఏఈ అధికారి దుర్మరణం…రోడ్డు ప్రమాదంలో ఏఈ అధికారి దుర్మరణం చెందిన ఘటన బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం..బోధన్ పట్టణంలో విద్యుత్ డిపార్ట్మెంట్ లో ఏఈ గా విధులు నిర్వర్తిస్తున్న రవిచంద్ర(47).విధులు నిమిత్తం వెళ్తున్నా సమయంలో వాహనం అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొనడంతో తలకు తీవ్ర గయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు నిజామాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చికిత్సా పొందుతూ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ పోలీసులు తెలిపారు.