Monday, December 8, 2025
HomeCRIMEఅశోక్ సాగర్ చెరువులో దూకి వ్యక్తి ఆత్మ హత్య.

అశోక్ సాగర్ చెరువులో దూకి వ్యక్తి ఆత్మ హత్య.

అశోక్ సాగర్ చెరువులో దూకి వ్యక్తి ఆత్మ హత్య…అశోక్ సాగర్ చెరువులో దూకి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఎడపల్లీ మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎడపల్లి పోలీస్ లు తెలిపిన కథనం ప్రకారం.

బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన భోగేవారు రమేష్( 35). వృతి రీత్యా లేబరు పనులు చేసుకుంటారు. గురువారం కుటుంబ కలహాలతో జానకంపేట అశోక్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు.

మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!