మాజీ స్పీకర్ పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి
మాజీ స్పీకర్ పోచారంతో సీఎం రేవంత్ శుక్రవారం భేటీ అయ్యారు..బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి.
నేడో, రేపో ఆయన హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన పలుమార్లు మంతనాలు జరిపారని సమాచారం.
కాగా ఈరోజు పోచారం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం పాటు మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు.
