మద్యం మత్తులో యువకుడు ముగ్గురిపై కల్లు సీసాతో పొడిచి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన రూరల్ మండలంలోని గుపన్ పల్లి లో చోటు చేసుకుంది.రూరల్ ఎస్ఐ అరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..
గుపన్ పల్లి గ్రామానికి చెందిన మదన్ మద్యం మత్తులో ఓ కిరాణా దుకాణం ముందు కూర్చున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాంపల్లి శైలేందర్ అతని స్నేహితుడైన అనిల్ లు ఇద్దరు బయటకి వెళ్లి తిరిగి అనిల్ ను ఇంటివద్ద దింపడానికి బైక్ పైన వెళ్ళినట్లు తెలిపారు.
ఈ మేరకు పక్కనే ఉన్న కిరాణా దుకాణంలో నీళ్ళ బాటిల్ తీసుకోడానికి వెళ్లగా అక్కడే మద్యం మత్తులో కూర్చొని ఉన్న మదన్ కి శైలాందర్ కాలు తగిలినట్లు తెలిపారు.కాలు తగలడంతో శైలాందర్ కు మదన్ కు మధ్య మాటల యుద్ధం పెరిగినట్లు తెలిపారు.
మాటామాటా పెరిగి అదే క్షణికావేశంలో మదన్ పక్కనే ఉన్న కల్లు. బట్టికి పోయి పగిలిన కల్లు సీసా ముక్కతో శైలేందర్ పై దాడి చేయగా చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
అదే సమయంలో అనిల్ వాళ్ల అక్క ఇంట్లోనుంచి బయటకి వచ్చి చూసి మధ్యలో ఆపడానికి వెళ్లగా ఆమె మొఖం పై దాడి చేసినట్లు తెలిపారు.పక్కనే ఉన్న స్థానికులు గమనించి బెదిరించగానే మదన్ అక్కడి నుంచి వెళ్ళి పోయాడని అన్నారు.
మదన్ తిరిగి వచ్చి అనిల్ కడుపులో పొడిచినట్లు తెలిపారు.దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాకపోవడంతో హుటాహుటిన నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరీఫ్ తెలిపారు.
