HomeCRIMEబెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్..

బెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్..

ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

నగరంలోని లతీఫ్ కాలనీకించేసిన షేక్ ఆసిఫ్ అలీ గత కొన్ని రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ సురేష్ కుమార్,ఆరవ టౌన్ ఎస్ఐ వెంకటరావు ఆద్వర్యంలో అర్సపల్లి బైపాస్ రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకులో వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు.అప్పటికే నిందితుడు ఆన్లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, తాను ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడించడానికి నిజామాబాద్ లో కొంత మంది యువకులకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మాయ మాటలు చెప్పి వారితో ఆన్ లైన్ లో డబ్బులు వసూలు చేసుకొని క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాడిని అని ఆసిఫ్ ఆలీ ఒప్పుకున్నట్లు తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఆసిఫ్ ఆలీ ని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments