తెలంగాణ ఉద్యమ సారథి కెసిఆర్ కుటుంబం జోలికి వస్తే నాలుక చీరేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు .
ఆయన కౌంటర్ ఇచ్చారు . అబద్దాలకు అరవింద్ నిలువెత్తు అద్దమని
బీజేపీ జోకర్, పొలిటికల్ బ్రోకర్ అని, పదవుల కోసం రంగులు మార్చే ఊసరవెల్లి అని ఆయన అన్నారు.
ఎంపీగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి నయాపైస తెచ్చావా? అని నిలదీశారు.
పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పాలని, నేమ్ ప్లేట్ నిజామాబాద్ లో, పసుపు బోర్డు ఆఫీస్ ఢిల్లీలో ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.. తెలంగాణ ఉద్యమంలో అరవింద్ కుటుంబం ఎక్కడుంది?.
ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి డబ్బులు దండుకుంటూ సీమాంధ్రుల పంచన చేరి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయిన చరిత్ర డీఎస్ కుటుంబాని దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మౌత్ స్పీకర్ గా మారిన అరవింద్ పదేపదే కేసీఆర్ ఫార్మ్ హౌస్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
అరవింద్ కు దుబాయిలో అసాంఘిక కార్యకలాపాలకు నెలవైన ఒక గెస్ట్ హౌస్ ఉన్న విషయాన్ని మర్చి పోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక్క రోజయినా బీజేపీ నాయకులు పోరాడారా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించే స్థాయా నీది?. కేసీఆర్ ది ఉద్యమ కుటుంబం.
అరవింద్ ది అవినీతి ఫ్యామిలీ.
కేసీఆర్, కేటీఆర్, కవిత కాలిగోటికి సరిపోరు.
కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన మనిషి అని కూడా చూడకుండా, ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా బీజేపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారు.
గల్లీ లీడర్ల కన్నా అద్వాన్నంగా తప్పుడు కూతలు కూస్తున్నారు.
ఎంపీ అరవింద్ గడ్డి తింటున్నాడా?, అన్నం తింటున్నాడా?.
కేసీఆర్ ఫ్యామిలీపై ఎందుకు విషం కక్కుతున్నావు ?
తెలంగాణ తెచ్చినందుకా ?తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ ను తిడుతున్నావా?
కేసీఆర్ మీద భాష ఇలాగే కొనసాగితే నిజామాబాద్ జిల్లా ప్రజలే అరవింద్ నాలుక చీరేస్తారు.
అరవింద్ వి లంగా లఫంగి ,బట్టెబాజ్ మాటలు కావా?. బీజేపీ నేతలు అసభ్య పదజాలంతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు.
తిట్లతో ప్రజల దృష్టి ని మళ్ళించ లేరన్నారు. హెచ్ సీ యూ భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పల్లకి మోస్తున్న బీజేపీ ఎంపీ లు ఒక్కనాడైనా తెలంగాణ కోసం ఢిల్లీలో గళమెత్త లేదన్నారు.
రైతు బంధు ఇవ్వనందుకు, రుణమాఫీ పూర్తి చేయనందుకు, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చినప్పుడు,నీళ్లయ్యకుండా పంటలు ఎండిబెట్టినప్పుడు, యూనివర్సిటీ అటవీ భూములను విధ్వంసం చేసినప్పుడు స్పందించని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజాపాలన పేరుతో జరుగుతున్న ఆటవిక పాలనపైన,
ఏ ఒక్క సమస్యపైన నిలదీయకపోగా రేవంత్ రెడ్డికి ఆప్త మిత్రుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు
తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ ఎంబీ స్వాధీనం చేసుకున్నప్పుడు,
బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వకుండా మొండి చేయి చూపినప్పుడు ఎనిమిది
బీజేపీ ఎంపీలు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ వ్యతిరేకులేనని, ఆ పార్టీలకు
తెలంగాణ సోయి లేదని ఆయన అన్నారు.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.