HomeTelanganaNizamabadపసుపు బోర్డు సాధించడం పట్ల వినూత్నంగా ధన్యవాదాలు తెలిపిన యువతి

పసుపు బోర్డు సాధించడం పట్ల వినూత్నంగా ధన్యవాదాలు తెలిపిన యువతి

నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అర్వింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి) కి చెందిన ఫోటోగ్రాఫర్ మల్లేష్ కుమార్తె చిన్నకరి భవాని కోట గల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

పసుపు బోర్డును నిజామాబాద్ కు మంజూరు చేయించుకోవడమే కాక, జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, స్థానిక భాజపా నాయకుడు యాదాల నరేష్ ఇంట్లో ధన్యవాదాలు తెలిపేలా ముగ్గు వేసింది.

ముగ్గులో మోడీ, అరవింద్, కమలం పువ్వు చిత్రాలు గీసి వీరిద్దరిని ఇందూరు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొంది. తనకి ఇప్పటివరకు ఓటు హక్కు రాలేదని, కానీ తాను వేసే మొదటి నుండి జీవితాంతం వేసే చివరి వరకు ఎవరికి వేయాలో నిశ్చయించుకున్నానని తెలిపింది.

కాగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని చూసిన ఎంపి అర్వింద్ యువత వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని, తమ పట్ల యువతికి ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments