ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి చెందిన ఘటన ఎదపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం. ఎడపల్లి మండలంలోని తాడెం గ్రామానికి చెందిన నవదీప్(12). అతని తల్లి గురువారం ఇల్లు చక్కబెట్టే క్రమంలో నవదీప్ ను సజ్జ పైన ఎక్కించింది. సామాను చక్కబెట్టి కిందికి దిగే క్రమంలో నిచ్చెన మాదిరిగా ముడులుగా కట్టిన చీర లో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకొని మృతి చెందినట్లు తెలిపారు.
తల్లి బయట నుంచి ఇంట్లొకి వచ్చి చూసే సరిగి నవదీప్ ను గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.