HomeCRIMEనాంపల్లి స్టేషన్ లో కాల్పులు …..ఉలిక్కి పడ్డ ప్రయాణికులు

నాంపల్లి స్టేషన్ లో కాల్పులు …..ఉలిక్కి పడ్డ ప్రయాణికులు

హైదరాబాద్ నాంపల్లిలో రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ లే అడ్డాగా చేసుకొని ఓ ముఠా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంది. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్ గురువారం అర్ధ రాత్రి నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ లో సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టింది .

ఈ క్రమంలో ఓ ముఠా రైల్వే స్టేషన్ సమీపంలోనే పోలీసుల కు ఎదురు పడ్డారు దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. దీనితో ఓ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు రాజుకు గాయాలు అయ్యాయి. అతనికి తొడలో బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అపస్మార స్థితిలో కి వెళ్ళాడు.

చికిత్స నిమిత్తం రాజు ను హుటాహుటిన సమీపంలోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు రాజు . తొడలో దిగిన బుల్లెట్ ను స్వల్ప ఆపరేషన్ చేసి తొలగించారు . అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి .

మరో వ్యక్తి అయ్యాన్ ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వేలాది ప్రయాణికులతో సందడి గా ఉండే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీస్ కాల్పుల ఘటన తో అంతా ఉలిక్కి పడ్డారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments