జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఊరు పొలిమేర శ్మశాన వాటికలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది… గ్రామానికి చెందిన ఆడ్డగళ్ల సాయిలు (20) ఈ మద్యే హైదరాబాద్ వెళ్లి ఓ కంపెనీలో పని చేశాడు. తిరిగి గ్రామానికి వచ్చేసాడు , కానీ బ్రతుకు దెరువు కోసం ఏం పని చేయాలో అర్థం కాలేదు.
దీనితో జీవితంపై కలిగి విరక్తి చెందిన సాయలు గురువారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక గ్రామ శివారు లో ఉన్న శ్మశాన వాటికలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటింబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.