తమ్ముని చేతిలో అన్న మృతి చెందిన ఘటన ఆర్మూర్ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్మూర్ టౌన్ సిఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి కి చెందిన వరికుప్పల నర్సయ్య(36). భార్య,ముగ్గురు కుమారులు ఉన్నారు.నర్సయ్య వాళ్ళు నలుగురు అన్నతమ్ములు వీరి మధ్య అస్థి విషయంలో పలు మార్లు గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం అస్థి విషయంలో తమ్ముడు గంగాధర్, నర్సయ్య ను కర్రతో తల పై బాదడంతో నర్సయ్య తల కు తీవ్ర రక్తస్రావం అవ్వడంతో కుటుంబ సభ్యుల హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.