ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ మహేష్ తెలిపిన సమాచారం మేరకు..నిజామాబాద్ నగర శివారులోని మల్కాపూర్ (కొత్తపెట్) గ్రామానికి చెందిన తాటిపాముల శివప్రసాద్(48).భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.వృతి రీత్యా డ్రైవర్ పనులు చేసుకుంటారు.
గత నెల జూన్ 20న నరసగౌడ్ అనే వ్యక్తి తో గొడవ జరిగి శివప్రసాద్ ను తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధు చేరని తెలిపారు.ఈ మేరకు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఇంచార్జీ సీఐ సతీష్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.