అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఇందల్ వాయి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
ఇందల్ వాయి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మురికి కాలువలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నట్లు స్థానికులు గమనించారు. స్థానికులు గమనించి స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తుల వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.