రైల్ కింద పడి హోం గార్డ్ ఆత్మ హత్య చేసుకున్న దుర్ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట కు చెందిన సంపత్(43). భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.హోం గార్డ్ గా కమిషనరేట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.సంపత్ ఆత్మ హత్య కు దారితీసిన పరిస్థితిల ఫై భిన్న వాదనలు తెరమీదికి వచ్చాయి.
కానీ వేధింపుల వల్లే సంపత్ ఆత్మ హత్య కు పాల్పడి ఉంటారని అతని సన్నహితులు అనుమానిస్తున్నారు. ఆయన ఇదివరకు కమిషనరేట్ లో రిసిప్షన్ కౌంటర్ లో పనిచేసేది. కానీ అక్కడి నుంచి ఆయన హోంగార్డ్ ఆఫీస్ కు అటాచ్ చేశారు. అప్పటి నుంచి సంపత్ ను కామారెడ్డి వెళ్ళాల్సింది గా ఓ అధికారి ఒత్తడి చేసారని సమాచారం.ఇదే విషయంలో ఆయన తీవ్ర ఆందోళన చెందారని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఆయన ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా సంపత్ కన్నుకు గాయం అయింది. ఆ కారణంగాముథోల్ లో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కి వెళ్తానని చెప్పి శనివారం ఉదయం 4గంటల కు ఇంట్లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం లోని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. .కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
