తన భూమిలో చొరబడి కోత కు వచ్చిన పంట ధ్వంసం చేసి తనతో భార్య ను కొట్టిన రియల్టర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మోపాల్ మండల సిర్పూర్ తండా కు చెందిన విస్లావత్ గుండు నాయక్ డిమాండ్ చేశారు.
మూడు సంవత్సరాల క్రితం నిజామాబాదుకు చెందిన గంగారెడ్డి కి చెందిన 8 ఎకరాల భూమిని సర్వే నంబర్ 592, 593 ,591 ,కౌలు కి తీసుకోని అందులో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తునని .
ఈ వర్షాకాలపు పంట ఆరవ పంట అన్నారు కానీ నిజామాబాద్ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రాజిరెడ్డి, హరీష్ రెడ్డి, నరేష్ రెడ్డి ,మధుసూదన్ రెడ్డి, లు 50 మందితో వచ్చితన పంట భూమిలో చొరబడ్డారని అంతేగాకుండా బూతు మాటలు తిట్టారని ఆ భూమి తమదని కౌలు చేయడానికి నీకు ఎలాంటి హక్కు లేదని నా పై పైకి వచ్చి నారు
ఈ భూమిలో ఎందుకు కౌలు చేస్తున్నావు అంటూ చేయి చేసుకున్నారని నేను గత మూడు సంవత్సరాల నుండి ఈ భూమి బొడ్డు గంగారెడ్డి వద్ద కౌలు తీసుకొని సాగు చేస్తున్నాను అని వారితో చెప్పిన వినకుండా నా మీదకు వచ్చి చేతులతో కొట్టినారు
అయినప్పటికీ నేను బొడ్డు గంగారెడ్డి మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మీరు మాట్లాడుకోండి నేను కేవలం కౌలు రైతును మాత్రమే అని చెప్పినా నా మాటలు పట్టించుకోకుండా నాపై దాడి చేసి కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేను వేసిన పంట ను ధ్వంసం చేసారని దాన్ని విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయలుంటుందన్నారు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నన్ను నా భార్యను నా కుమారుడిని బూతు మాటలు తిట్టినారు
ఈ భూమి మాది ఈ భూమి లోకి నువ్వు రావద్దు అని నన్ను తల మీద కొట్టారని నా భార్యను తోసి వేయగా ఆమె క్రింద పడిందన్నారు .పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే గ్రామ జోక్యం చేసుకొని పంట నష్టపరిహారం ఇప్పిస్తామని
సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్పారని అందుకే నేను ఫిర్యాదు చేయకుండా ఆగిపోయాను కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోగా భూమిని ఖాళీ చేసి వెళ్లి పోతానని ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వ్యవసాయం చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు.
