HomeTelanganaNizamabadకార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం...స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి..పిసిసి చీఫ్ మహేష్ కుమార్...

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం…స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి..పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

దృఢసంకల్పం కలిగిన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం డిచ్ పల్లి లోని కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు..

టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన సంక్షేమం,కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిందని తెలిపారు.నిజామాబాద్ జిల్లా కోడలు కవిత 2014 లో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండే 2024లో ఎలా ఉంది అని ప్రశ్నించారు.

గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు అనుభవించారని విమర్శించాడు.జిల్లాలో ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, చిన్న చిన్న సమస్యలతో రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్దని ధీమా వ్యక్తంచేశారు.

39 సీట్లు వచ్చిన,రాష్ట్రంలో ప్రతిపక్ష హోద ఇచ్చిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీ ఆర్ ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి కోసం కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు పోటీగా సమావేశాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇక దేశంలో బీజేపీ మతం పేరుతోనే,కులం పేరుతో ప్రజలను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ఇక నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని హర్షం వ్యక్తంచేశారు. ఈ జిల్లా అర్గుల రాజారాం ఏలిన జిల్లా,అలాగే ఈ జిల్లా నుంచి డీ.శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు చేసిన జిల్లా అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

అలాగే ఏడాది లో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమలు అభివృద్ధి పై ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అలాగే కాంగ్రెస్ లో కార్యకర్త నుంచి ఏఐసీసీ వరకు అందరం సమానమేనని తెలిపారు.

ఈ సమావేశాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న దీపదస్స్ మున్షీ మాట్లాడుతూ.. నఫ్రత్ చోడో..నిజామాబాద్ జోడో నినాదంతో కాంగ్రెస్ కార్యకర్తలు..నాయకులు ముందుకెళ్లాలని సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానం ఓడిపోకుండా చూడండి జిల్లాకు మంత్రి పదవి కోసం నేను మాట్లాడతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments