చైనా మాంజా విక్రయిస్తున్న పతంగుల దుకాణాల్లో పోలీసులు దాడులు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య సిసిఎస్ సిబ్బందినగరంలో ని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పతంగుల షాపులపై రైడ్ చేసి 15 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ సుమారు 15 వేల రూపాయలు ఉంటుంది.
పతంగుల షాపు యజమానులు అష్రాఫ్ అహ్మద్ ఇద్దరినీ మరియు స్వాధీనపరుచుకున్న 15 చైనా మాంజా బాబిన్లను తదుపరి చర్య లకై టౌన్ 2 ఎస్ హెచ్ ఓ గఅప్పగించారు .
