నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వణమైన స్థితిలో ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.
బుదవారం నగరంలోని సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వణమైన స్థితిలో ఉన్నాయని కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించడం లేదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నాణ్యమైన విద్య అందకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మేను ప్రకారం మిడ్డే మిల్స్ అందించాలని అలాగే నాణ్యమైన విద్య అందించాలని అన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యశాఖకు ఆదేశాలు ఇచ్చారు.
వచ్చే విద్య సంవత్సరానికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విదంగా తల్లితండ్రుల్లో అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దేల కృషి చేయాలన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మన బడి ధ్వరా వచ్చిన నిధులు వాటి వివరాలు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఆదర్శ పాఠశాలల పథకం ధ్వరా వచ్చిన నిధులు, పనుల వివరాలు, పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పన గురించి చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి అశోక్ కుమార్,నార్త్ , సౌత్ , మండల MEO లు, విద్యాశాఖ ప్లానింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
