HomeTelanganaNizamabadమహిళా శక్తికి నిదర్శనం అహల్య భాయ్ హోల్కర్ - అర్బన్ ఎమ్మెల్యే

మహిళా శక్తికి నిదర్శనం అహల్య భాయ్ హోల్కర్ – అర్బన్ ఎమ్మెల్యే

అహల్య భాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్బంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ & హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు లోక మాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ హిందూ దేవాలయాలకు గొప్ప మార్గదర్శకురాలు మరియు నిర్మాణకర్త అన్నారు.

ఆమె భారతదేశం అంతటా వందలాది దేవాలయాలు మరియు ద్వారక నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు.

• 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మత్తు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి ఉందని తెలియజేసారు.

• అహల్య భాయ్ పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించిందని దానికి ఉదా: ఆమె తన ఏకైక కుమారుడిని ఏనుగుతో చితకబాది మరణశిక్ష విధించిండం అన్నారు.

• ఆమె తన పాలనలో పిల్లలు లేని వితంతువుల ఆస్తిని జప్తు చేసే సాంప్రదాయ చట్టాన్ని తొలగించడంతో సహా కొన్ని మైలురాయి నిర్ణయాలు కూడా తీసుకుందన్నారు.

• ఈ దేశ ప్రజలు ఎమర్జెన్సీ విధించి, హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఈ దేశాన్ని విచ్చిన్నం చేసిన ఇందిరా చరిత్ర కాదు తెలుసుకోవాల్సింది. అహల్య భాయ్, ఝాన్సీ లక్ష్మి భాయ్, రాణి రుద్రమ్మ, ఛత్రపతి శివాజిని తయారు చేసిన జిజియా భాయ్ లాంటి ధీర వనితల చరిత్ర తెలుసుకోవాలని,వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

• నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్నా దాడులు, హిందూ దేవాలయాలపైన జరుగుతున్నా దాడులను హిందువులుగా అందరం సంఘాటీతం అయి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగోళ్ళ లక్ష్మినారాయణ, ప్రోగ్రాం కన్వినర్ పోతంకర్ లక్ష్మినారాయణ, కో కన్వినర్ ప్రవళిక, శ్రవంతి, జ్యోతి బిజెపి మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments