ట్రాఫిక్ నియంత్రణకు దుకాణ యజమానులు సహకరించాలని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ పేర్కొన్నారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో నగరంలోని దుకాణ సముదాయాల యజమానులతో,తోపుడు బండ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరంలోని ప్రతి ఒక్కరు వారి దుకాణాలలోనే వ్యాపారం చేసుకోవాలని,ఫూట్ పాత్ ఆక్రమించకూడదని హెచ్చరించారు.
అలాగే ఎట్టి పరిస్థితుల్లో రోడ్ ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్/ ఫుట్ పాత్ ఆక్రమించవద్దని, వాహనాలను రోడ్డు మీద అక్రమ పార్కింగ్ చేయ వద్దని, తోపుడు బండ్లు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు నిలపరాదని పేర్కొన్నారు.
దుకాణ యజమానులు వారి యొక్క సామాగ్రి ఫుట్ పాత్ ఆక్రమించడం చేయరాదని లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ సమావేశములో దుకాణా సముదాయ యజమానులు,ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
