HomeCRIMEభార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య..

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య..

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిచ్కుంద మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..

మండలంలోని మంగళి సంగ్రామ్ గ్రామానికి చెందిన సునీల్, జ్యోతి తో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ మేరకు ఈ నెల 14 వ తేదీన భార్య శ్రీమంతం నిమిత్తం పుట్టింటి వద్ద వదిలేసి వచ్చారని తెలిపారు.

తిరిగి 23వ తేదీన భార్య జ్యోతినీ పుట్టింటి నుంచి తీసుకొచ్చే క్రమంలో పెద్ద మైసమ్మ గుడి దగ్గరికి రాగానే ప్రమాదవశాత్తు తన భార్య బైక్ పై నుండి కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.

దీంతో భార్య మరణం తట్టుకోలేక మనస్థాపానికి గురైన సునీల్ ఇంట్లోని బాత్ రూం లో యాసిడ్ తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments