Tuesday, April 28, 2026
HomeTelanganaNizamabadగాండ్ల పెట్ వరద కాలువ గండి పడిన ఘటనపై విచారణ చేపట్టాలి.

గాండ్ల పెట్ వరద కాలువ గండి పడిన ఘటనపై విచారణ చేపట్టాలి.

గాండ్ల పెట్ వరద కాలువ (ఆక్యుడెక్ట్) గండి పడిన ఘటనపై విచారణ జరిపి చర్య తీసుకోవాలనీ అఖిలభారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేశారు.

శ్రీరామ్ సాగర్ రెండవ దశ పనుల్లో భాగంగా వరద కాలువ నిర్మాణం పనులు 130 కిలోమీటర్లు పూర్తి చేసి మిడ్ మానేరును నీటి తో నింపేస్తుంది… నిజాంబాద్ జిల్లా పరిధిలో లక్ష్మీ కాల్వ ద్వారా సుమారు 3/12 కిలోమీటర్ల కాల్వ ద్వారా సుమారు 22 వేలఎకరాలు సాగు చేయబడుతుంది.

ఉత్తర తెలంగాణకు ధాన్యగా రంగా భూములను సస్యశ్యామలం చేసిన ఈ కాలువలకు మెయింటినెన్స్ సరిగ్గా లేవని పేర్కొన్నారు. ఇటీవల గాండ్లపేట అక్విడేట్ వద్ద గండి పడింది.గండి పడిన ప్రదేశాన్ని అఖిలభారత ఐక్య రైతు సంఘం.

అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు బుదవారం ఆ ప్రదేశానికి వే ళ్లి పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐ యూ కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు. వి. ప్రభాకర్. రాష్ట్ర కార్యదర్శి. బి. దేవారం. . జిల్లా ప్రధాన కార్యదర్శి. G. కిషన్. మాట్లాడుతూ వర్ధకాలువ సుమారుగా 130 కిలోమీటర్లు ఉంది.

కాలువ కట్టలు, అక్విడేట్లు మెయింటెనెన్స్ సంబంధిత ఇరిగేషన్ అధికారులు చూడాలి.. ఏ ప్రాంతంలో అయినా లీకేజీలు ఉన్నాయా! పరిశీలించాలనీ అన్నారు.

ఇది పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.. ఈ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి కెనాల్ సుమారు మూడున్నర కిలోమీటర్ల తో నిర్మాణమై 22,000 ఎకరాలు నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో సాగు అవుతుంది..

కానీ ఈ కాలువ శిథిలావస్థకు వచ్చిందని ఇప్పటికే రైతులు అనేకసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకుని నాథుడే లేడు…ఈ నేపథ్యంలోనే గాండ్లపేట ప్రమాదాన్ని పసికట్టడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందార ని మా బృందం భావిస్తుంది అని అన్నారు.

ఈ గండి పడడంతో మామిడి రాజన్నని దళిత రైతు మూడు ఎకరాలు వరి పంట మొత్తం సర్వనాశనమైంది. అంతేకాకుండా మీటర్ ఎత్తుతో ఉసికెమెటవేసింది..

తిరిగి సాగులోకి తీసుకురావాలంటే కనీసం నాలుగు లక్షల రూపాయలు దళిత రైతుకు ఆర్థిక భారం పడుతుందని , మొత్తం వరి పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

దీంతోపాటు గత నాలుగు సంవత్సరాలుగా ఈ దళిత కుటుంబం తమ పట్టా భూమిని ఆన్లైన్ ఎక్కించమని అధికారుల చుట్టూ తిరుగుతున్న దళిత రైతును పట్టించుకున్న పాపాన పోలేదు… వెంటనే దళిత రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు…

వరద కాలువతో పాటు 284 కిలోమీటర్ల కాకతీయ కాలువ లో పూ డికతో నిండిపోయిందని లోకమెరిగిన సత్యం. సర్వే చేసి లోటుపాట్లను సరిచేయాలని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడిక పూర్తిగా నిండిపోయి సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర తెలంగాణ రైతాంగానికి పెను ప్రమాదం ఏర్పడుతుందని సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

వాస్తవ సేకరణ బృందంలో.. అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. S. సురేష్..వి. బాలయ్య. మాజీ ఎంపీటీసీ. డాక్టర్ సత్యనారాయణ గౌడ్. POW జిల్లా నాయకురాలు సత్యక్క తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!