HomeCRIMEఅత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్ సైరన్ వినియోగించాలి --ఒకటవ టౌన్ సీఐ రఘుపతి, ట్రాఫిక్ సిఐ...

అత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్ సైరన్ వినియోగించాలి –ఒకటవ టౌన్ సీఐ రఘుపతి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ లు స్పష్టం చేశారు

రోగుల ప్రాణాపాయం ఉన్నప్పుడు లేదా తీవ్రమైన గాయాలతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్ ఉపయోగించాలని ఒకటవ టౌన్ సీఐ రఘుపతి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ లు స్పష్టం చేశారు.

బుదవారం నగరంలోని అంబులెన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఒకటవ టౌన్ సీఐ రఘుపతి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యవసర వైద్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా, వారి బాధ్యతలను గుర్తు చేశారు. ట్రాఫిక్ తప్పించుకోవడానికి లేదా అత్యవసరం కాని సందర్భాల్లో సైరన్‌ను దుర్వినియోగం చేయకూడదు అని హెచ్చరించారు.

చాలామంది డ్రైవర్లు కనీస యూనిఫాం ధరించడం లేదని, కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రోగిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడానికి డ్రైవింగ్‌లో ఎక్కువ జాగ్రత్త వహించాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని పోలీసులు సూచించారు.

అంబులెన్స్ సేవ అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని, ఈ సేవలో ఉన్నవారు డబ్బుల కంటే ప్రాణం విలువకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో ఇందూరు అంబులెన్స్ సర్వీస్ ప్రైవేట్ యూనియన్ అధ్యక్షులు ఎస్ రాజేందర్, సెక్రెటరీ ఎన్ కిరణ్, ఉపాధ్యక్షులు అన్వర్ ఖాన్, ట్రెజరర్ కే వరప్రసాద్, జైంట్ సెక్రెటరీ ఇన్ మైపాల్, మరియు అంబులెన్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments