ఐఏయస్ అసోసియేషన్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎన్టీవీ, తెలుగు స్క్రైబ్, టీ న్యూస్ సహా మరో ఆరు న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్స్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసారు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి ని నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి వేధింపుల లకు గురిచేస్తున్నారంటూ ఎన్టీవి టీ న్యూస్ ల్లో కథనాలు వచ్చాయి.
ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాలను కుదిపేసింది మరో వైపు ఐఏయస్ ఐఎఫ్ యస్ ఐపీఎస్ అసోసియేషన్ లు సైతం తీవ్రం స్పందించాయి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాయి.
టి న్యూస్ ఎన్టీవీ యాజమాన్యాలు లైట్ తీసుకున్నాయి దీనితో ఆయా ఛానల్స్ లో వచ్చిన వార్తలపై ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది దీనితో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు మొదలు పెట్టారు
