నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ భారతీయ యువతకు స్వామి వివేకానంద గొప్ప దిక్సూచి అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు.
సోమవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ గొప్ప మహనీయుడు వివేకానందుడని, ఆయన చూపిన బాటలో నడిచినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు.
ఆయన ఆశయాలు చిరస్మరణీయం: మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద అని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ కొనియాడారు. ఆయన బోధనలు నేటికీ ఎంతో ప్రశస్తమైనవని, యువతలో చైతన్యం నింపేందుకు ఆయన సూక్తులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
