నగరంలో వృద్దుడు అదృశ్యమైన సంఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…
నగరంలోని కోటగల్లి కి చెందిన దోముల సుదర్శన్ (60).సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.
దీంతో మంగళవారం నాలుగవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
ఎవరికైనా ఆచూకీ తెలిసిన వారు నాలుగవ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
