HomeCRIMEఅసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలి..హత్య, అత్యాచార, పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయండిజిల్లా స్థాయి నేర...

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలి..హత్య, అత్యాచార, పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయండిజిల్లా స్థాయి నేర సమీక్షా సమావేశంలో సిపి సాయి చైతన్య..

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హితవు పలికారు. మంగళవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెండింగ్లో ఉన్న ( అండర్ ఇన్వేస్టిగేషన్ ) కేసులలో గ్రేవ్ , నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ మరియు నాన్ గేవ్ కేసులలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతీకేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు.

పోక్సో గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలి అన్నారు. ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఇన్వేస్టిగేషన్ , స్టేషన్ మేనేజ్మెంటు తెలిసిఉండాలన్నారు.

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసు లతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలన కేసుల సంఖ్య తగ్గించే విధంగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం చేసే లా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీస్ అధికారులు ( వి.పి.ఓ ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకంమవుతు నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్ , డయల్ 100 వాటి వినియోగం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహణ కల్పించాలని అన్నారు.

ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్.సి.ఆర్.పి https://www.cybercrime.gov. ఇంకా పోర్టల్ యందు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు.

అసాంఘిక కార్యకలాపాలు గంజాయి , ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ క్రయవిక్రయాల పైన, జూదం , పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అలాగే తరచుగా అసాంఘిక కార్యకలాపాల నేరాలకు పాల్పడేవారి పై పీడీ యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జరిచేశారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) బస్వా రెడ్డి , నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి లు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్ , సి.ఐలు , ఎస్.ఐ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments