తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు నిజామాబాద్ నగరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. దుబ్బ చౌరస్తాలో అంబిక సత్య నారాయణ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు .
ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, నాడు ఐటి రంగానికి బీజం వేసి, ప్రపంచ దేశాలకు పోటీగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచడం గర్వకారణం అని అన్నారు..
ఈ వయసులో కూడా రాష్ట్రం అభివృద్ధి కొరకు అనునిత్యం పాటు పడుతూ ప్రజలలో ఉంటూ నిత్య యువకుడిల ఉండటం, ఆయనను ఆదర్శం తీసుకుని ప్రతి ఒక్క యువకుడు ముందుకెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, బొబ్బ నరసింహ రావు, కోయెడి నర్సింలు, ఎల్లంకి పురుషోత్తం,మల్లారెడ్డి, లవంగ రాజు, ఇప్పలపల్లి విష్ణు, వేముల నాగేశ్వరరావు, జాఫర్, రషీదా, రాములు, గంగోనే రాజేశ్వర్, లక్ష్మీ యాదవ్, కమల బాయ్, రవి కుమార్ పాటిల్, రామ కృష్ణ రెడ్డి, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.
