ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విశాఖ కాలనీలో గురువారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. వినోద్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లి నిమిత్తం గ్రామ దేవతల పూజకు కుటుంబంతో కలిసి వెళ్లగా, దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు.
బీరువాలోని 14 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
