HomeHEALTHనిజామాబాద్ జీజీహెచ్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నాగమోహన్‌..

నిజామాబాద్ జీజీహెచ్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నాగమోహన్‌..

నిజామాబాద్‌ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ నాగమోహన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) శుక్రవారం ఉత్తర్వులు జారీ .

ప్రస్తుతం ఆయన నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇప్పటి వరకు ఇక్కడ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా సేవలందించిన పి. శ్రీనివాస్‌ను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జిల్లాలో కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రి పాలనా పగ్గాలను డాక్టర్‌ నాగమోహన్‌కు అప్పగించడంతో వైద్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డీఎంఈ ఆదేశాల మేరకు ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments