HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా రవిబాబు..

ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా రవిబాబు..

ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా రవిబాబు మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించానని. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ కు బదిలీ పై వచ్చానని తెలిపారు.

మున్సిపల్ అధికారులు. సిబ్బంది పూల గుచ్చని అందించి స్వాగతం పలికారు. గతంలో ఇక్కడ పనిచేసిన రాజు కమిషనర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్ ఇంటి నంబర్ కొరకు 20వేల నగదు లంచం తీసుకుంటుండగా ఏసిబి పట్టుబడినారు.

ఈ సందర్భంగా నూతన కమిషనర్ మాట్లాడుతూ…. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా నా వద్దకు వచ్చి రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ వార్డ్ ప్రత్యేకఅధికారులకు ఆదేశించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments