బీజేపీ లో సంస్థ ఎన్నికల సందడి కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లోసత్తా చాటే దిశగా రేవంత్ సర్కార్ అనేక తాయిలాలను సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ సైతం సానుకూల ఫలితాల కోసం సన్నాహాలు చేస్తుంది. అందుకే స్థానిక ఎన్నికల పక్రియ మొదలయ్యే లోపే సంస్థాగత ఎన్నికలను పూర్తీ చేయాలనీ బీజేపీ నాయకత్వం భావిస్తుంది.
ఇందులో భాగంగా నే నేరుగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ బన్సాల్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన హైదారాబాద్ లోనే మకాం వేసి పనిచేస్తున్నారు. మండల, జిల్లాల ఎన్నికల అధికారులు ఇంచార్జి లతో పాటు ముఖ్య నేతలతో టచ్ వుంటూన్నారు. ఈపాటికే మండల స్థాయి లో ఎన్నికల పక్రియ ను దాదాపు పూర్తీ చేసారు.
50 -60 శాతం మండల కమిటీ ల ఏర్పాటు పూర్తీ అయిన జిల్లాలోనే జిల్లా ఎన్నికల పక్రియ మొదలుపెట్టాలనేది పార్టీ నియమావళి గా ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో 24 మండల లకు కొత్త కమిటీలను ఖరారు చేసారు.ధర్మా రావు కాసం వెంకటేశ్వర్ రావు లుసంస్థాగత ఎన్నికల పర్యవేక్షకులుగా ఉన్నారు.
మొదటి దఫాలో ఖరారు అయిన మండల కమిటీ ల్లో ఎంపీ అర్వింద్ ముద్ర స్పష్టంగా కనిపించింది. నాలుగాయిదు కమిటీ ల విషయంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ లేవనెత్తిన అభ్యంతరాలను అధిష్టానం పక్కకు పెట్టేసింది.
ఆయనే రాష్ట్ర ఎన్నికల అధికారిగా వుండడం తో జిల్లా నుంచి వెళ్లిన కమిటీ లకు ఆమోదం ముద్ర వేయకుండా యెండల నిలిపి వేశారు. ఎడపల్లి, మోపాల్ కుమార్ తో పాటు నిజామాబాద్ నగరంలో రెండు కమిటి లకు అధ్యక్షుడుని మార్చాలని యెండల పట్టుపట్టారు.
మాజీ ఎమ్మెల్యే హోదా లో యెండల సైతం ఓటరు కూడా. కానీ ఎడపల్లి, మోపాల్ దుబ్బా అధ్యక్షులు నియామకం లో సామజిక సమీకరణ అనివార్యం అయిందని సముదాయించారు అయినా యెండల కమిటీ లకు ఆమోదం తెలపలేదు.
ఈ వ్యవహారంను తీవ్రంగా పరిగణించిన అర్వింద్ రంగంలోకి దిగారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో మాట్లాడారు. బాన్స్ వాడ లో పోటీ చేసిన యెండల కు జిల్లా ఎన్నికల పక్రియ లో ఎలా జోక్యం చేసుకుంటారని అయినా పార్టీ నియమావళి ప్రకారం ఎన్నికల ఇంచార్జి కు కమిటీ ఎంపిక లో అభిప్రాయం చెప్పడానికే వీలు లేదని వాదించారు.
నియమ.. నిబంధనలు మేరకు ఎన్నికల పక్రియ జరిపి కమిటీ లను ఎన్నుకుంటే ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. దీనితో ఉన్నపలంగా ఆమోద ముద్ర వేశారు.
