HomeCRIMEఘరానా మోసగాడి అరెస్ట్

ఘరానా మోసగాడి అరెస్ట్

నగరంలోని ఓ వైద్యుడికి తన ఖాతా పెరుమీద ఉన్న 50 లక్షల రుణాన్ని మాఫీ చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి డాక్టర్ ను బురిడీ కొట్టించాడు.

ఈ సంఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే వద్ద నుండి సింగరేణి వర్కర్ నివాసం బీరప్ప నగర్, కుత్బుల్లాపూర్ కె.వి.రంగారెడ్డి కి చెందిన బంగారు అప్పారావు వ్యక్తి తనకున్న పలుకుబడి వ్యక్తులతో రుణాన్ని మాఫీ చేస్తానని డాక్టర్ని నమ్మించి బ్యాంకు లోన్ సెటిల్మెంట్ చేస్తానని తెలిపి అతని వద్ద నుండి 15 లక్షల తీసుకొని మోసం చేశారని తెలిపారు.

అలాగే కోరుట్ల కు చెందిన డాక్టర్ వద్ద లోన్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పి దాదాపుగా 60 లక్షల వరకు తీసుకున్నాడు. అలాగే మోర్తాడ్ కి చెందిన డాక్టర్ గారి వద్ద కూడా సెటిల్మెంట్ చేస్తానని 12 లక్షలు డబ్బులు తీసుకున్నాడు ఇతను ఇవే కాకుండా చాలామంది దగ్గర లోన్ సెటిల్మెంట్ చేస్తానని ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకున్నాడు.

ఈ డబ్బులు అన్ని రియల్ ఎస్టేట్లోనూ అప్పుల రూపంలోనూ ఇతరులకు ఇచ్చినాడు, కొన్ని ప్లాట్స్ కొన్నాడు, ఇట్టి వ్యక్తిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు. ఇట్టి కేసు విషయంలో ఇంకా విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments