………..అధికార పార్టీ నాయకుల ఒత్తడి తో బిమ్ గల్ పోలీసులు తనమీద అదనపు కట్నం కేసును బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ భీమ్‍గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కురి నిఖేష్ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. కలకలం రేపింది.
తామేమీ వేదించలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది భీమ్‍గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కుని నిఖేష్ తన భార్యతో ఉన్న గొడవల కారణంగా సమస్య పోలీస్ స్టేషన్ కు చేరింది.
ఈ విషయంలో భీమ్‍గల్ పట్టణానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు నిఖేష్ భార్య తరఫున ఫైరవీ చేస్తూ తన పై అక్రమంగా అదనపు కట్నం కేసును బనాయించేలా చేశాడని నిఖేష్ ఆరోపించారు.
తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్, నిజామాబాద్ సీపీ, ఆర్మూర్ ఏసీపీలతో పాటు భీమ్‍గల్ సీఐలకు కూడా తన గోడును విన్నవించుకుని న్యాయం చేయాలని కోరారు.
తన చిన్నతనంలోనే నాన్న చనిపోయాడని, వికలాంగుడైన అన్నయ్య, ఒక అక్కయ్య ఉన్నారని చెప్పారు. ఉపాధి కోసం తాను గల్ఫ్ కు వెళ్లి అక్కడే కొన్నాళ్ల పాటు పని చేశానన్నారు.
అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో అక్కడ పని వదిలేసి అమ్మకోసం సొంతూరికి తిరిగొచ్చానని నిఖేష్ తెలిపారు. ఇక్కడికి వచ్చాక కుటుంబ పోషణార్థం వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు.
ఇలాంటి సమయంలో తనపై అదనపు కట్నం కోసం తన భార్యను వేధిస్తున్నాననే ఆరోపణలు చేస్తూ తన భార్య ద్వారా భీమ్‍గల్ పోలీసులకు భీమ్‍గల్ కాంగ్రెస్ పట్టణ నాయకుడు తప్పుడు ఫిర్యాదు చేయించాడని నిఖేష్ ఆరోపించారు.
ప్రతిరోజు పోలీస్ స్టేషన్ రావాలంటూ కానిస్టేబుల్స్ ను తనింటికి పంపిస్తున్నారని, తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వీడియోలో ఆరోపించారు.
గ్రామంలో తన పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని, ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో హాజరు ఇవ్వాలని వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నారు.
తాను కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ఇవ్వాలని వేధిస్తున్నాడని, ఎస్ఐ వేధింపులు భరించలేక ఎక్కడెక్కడో ఇతర గ్రామాల్లో తల దాచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని నిఖేష్ వాపోయాడు.
