బిఆర్ యస్ అధినేత కెసిఆర్ ఎన్నికల ప్రచారం జిల్లాలో యదావిదిగా సాగేలా తాజా షెడ్యూల్ ఖరారు అయింది. కెసిఆర్ రెండు రోజులపాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది . మే 1 రాత్రి నుంచి 48 గంటలపాటు బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది.
సిరిసిల్ల లో . బస్సు యాత్రలో కెసిఆర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేదం విధించింది.గురువారం నుంచి యధావిధిగా బస్సు యాత్ర చేయనున్నారు. ఈనెల 6 న కెసిఆర్ జగిత్యాల్ నుంచి జిల్లాకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
రోజంతా జిల్లా లోనే వుంటారు.బాల్కొండ ఆర్మూర్ మీదుగా నిజాంబాద్ నగరంలోకి వచ్చి ఇక్కడే రోడ్డు షో చేయనున్నారు. మరుసటి రోజు కామారెడ్డి లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.