ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళన..
పెండింగ్‌లో ఉన్న వేతనాలను సకాలంలో విడుదల చేయాలని, సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆద్వర్యంలో సోమవారం నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా తమ జీతాలు ఆలస్యం అవుతున్నాయని, నెలాఖరులో మాత్రమే చెల్లింపులు అందుతున్నందున వారి ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని కార్మికులు ఆందోళనా వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో వేతనాలు సకాలంలో విడుదలయ్యాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీతాలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పేర్కొన్నారు.
జీతాలు విషయంలో కూడా ప్రభుత్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.18,000 నిర్ణీత నెలసరి వేతనం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకూ అమలు చేయలేరని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో జిల్లాలోని ఆశ వర్కర్లు పాల్గొన్నారు.